కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Friday 4 July 2014

అనుకోని అతిథీ

నే తలవని తలపువో .. మది పిలవని పిలుపుపో ..

ఎద గూటికి అతిథి వో .. అనుకోని అతిథి వో ..

ఎదురే చూడని కనులకు ఎదురుగా వచ్చావు ..

ఎదరున్నది ఎడారి కాదాని వాసంతం చూపావు ..

కమ్మని భాష్యం చెప్పావు చెలిమి చలువలోనా

రమ్మని గమ్యం పిలిచేలా నా దారిని మల్లించావు ..

నువ్వు ఎవ్వరో .. తెలియదు .. ఊరు పేరు తెలియదు ..

మనసు ముత్యమని తెలుసు .. నీ నవ్వు వెన్నెలని తెలుసు ..

మరపురాని జ్ఞాపకాలకి ఆలవాలమని తెలుసు ..

కరిగిపోయినా కాలం .. తిరిగిరానిదే .. కానీ ..


ఉండిపోయానే నీకై ఆ చోటనే .. నేనిను కలసిన చోటనే ..

మరిగిపోవు నా మనసుని .. ఆపలేనుగాని ..

శిలను కానులే చెలి..  ఉలి తాకిన శిల్పాన్నే ...

నీ తీయని ఊహల లోకం లో జాగృతమైనది నా కల ..

నా తీరని మోహపు మైకంలో మమేకం అయినది చెలి అలా ..

ఎన్నాళ్ళు గడచినా నను వీడిపోదే .. ఎన్నేళ్ళు వేచినా చెలి జాడ లేదే ..

మది కడలి నే మధియించిన ఎడబాటు విషమేలే .. నీ ప్రేమ అమృత మవులె ...

రాకోయి అనుకోని అతిథీ .. మరల మరల నన్ను మధించ నీ తరమా ...
 

6 comments:

  1. కరిగిపోయినా కాలం ..
    తిరిగిరానిదే .. కానీ ..

    ఉండిపోయానే నీకై ఆ చోటనే ..
    నేనిను కలసిన చోటనే ..

    ఎన్నాళ్ళు గడచినా నను వీడిపోదే ..
    ఎన్నేళ్ళు వేచినా చెలి జాడ లేదే ..

    ఎన్నెన్ని హృదయాలో !!
    ఎన్నెన్ని నిట్టూర్పులో !!

    బాగా వ్రాశారు మేడం ...
    అభినందనలు ...

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog nm rao garu. Late ga respond ayinanduku kshamistu naa thanks andukondi..

      Delete
  2. రాధిక గారు... చాలా రోజుల తర్వాత మీ బ్లాగుకి వచ్చాను. ముందుగా క్షంతవ్యుడను. కవితలు అదరగొడుతున్నారు. ఇదిలాగే కంటిన్యూ చేయండి... మంచి పదాలు, మంచి ఊహలు... భావాల అల్లిక కూడా చాలా బాగుంది. మీలో ఉన్న మంచి కవయిత్రిని ఇంకా చూడాలనుకుంటున్నా.... సింప్లి సూపర్బ్. రేపు ఊరెళ్తున్నానండి.

    ReplyDelete
    Replies
    1. Mee comment ippude choosaanu. Thank you sateesh garu

      Delete
  3. మరో చిన్న సూచన. మీకు కామెంట్‌ పోస్ట్‌ చేసే ముందు వర్డ్‌ వెరిఫికేషన్‌ అడుగుతోంది. ఆప్షన్‌లోకి వెళ్లి దాన్ని ఇనేక్టివ్‌ చేయండి. ఎక్కువ మంది కామెంట్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఆ ఆప్షన్‌ దొరకక పోతే.. చెప్పండి... నేను రూట్‌ ఇస్తాను

    ReplyDelete