కవితా హృదయం ...

ఓ అందమైన భావన .. అక్షరాల సుమ మాల గా కూరిస్తే ఓ కవిత గా రూపు దిద్దుకుంటుంది . ప్రకృతి పరవశమైనా .. చిరుగాలి పులకితమైనా ... మయూరం నర్తించినా .. మేఘం కరిగి వర్షించినా మనసు అందమైన భావనల్లో తేలియాడుతుంది .. నా భావన .. నా ఆలోచన .. నా రచనా శైలి .. మీతో పంచుకుందామని ఇలా కవితా హృదయం
పరిచా .. నచ్చితే ముచ్చట పడండి ..

Wednesday 14 May 2014

నను మార్చిన హృదయం

ఇదుగో ఇపుడే కలిసెను హృదయం ..

నాలో నిశినే తరిమిన ఉదయం ..

సరికొత్తగా మొదలయ్యిందే నా జీవితమే ..

గమ్మత్తుగా నింపే సావే నీ జ్ఞాపకమే ..

ఎదలో అలజడి నీవే ప్రేమా .......  ఇదుగో ఇపుడే


నా వెచ్చని శ్వాసే.. నీ ఊపిరిగా మార్చావే ఓ మైనా ..

నీ చిక్కని వెన్నెల .. నా దారంతా పరిచావే ఏ మైనా ..

ఈ చీకటంతా ఏమైన దమ్మా ? నీ కాటుకల్లె మారిందే గుమ్మా ..

నా మొండి వైఖరి ని ప్రేమించే గుణమా ..        ఇదుగో ఇపుడే


నీ తలపే నన్ను మరచేలా చేస్తుంది ..

నీతో వలపే నన్ను లోకానికి చూపింది ..

సరికొత్త జన్మా .. మొదలైన దమ్మా .. నను నాకు చూపే దర్పణమే నీవమ్మా ..

నీ చిలిపి చేష్ట లను ప్రేమించే నమ్మా .. ఇదుగో ఇపుడే





2 comments:

  1. హమ్మయ్య.. ఇన్నాళ్లూ బిజీ వల్ల అసలు ఏ బ్లాగూ చూడలేకపోయాను. ఎన్నికలు హడావిడీ..
    ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారు. ఈ బ్లాగ్ బాగుంది... రాధిక గారు.

    ReplyDelete
    Replies
    1. welcome again sateesh gaaru...aento..eemadhya nenu busy ayipoyaanu..samayam ketaayinchatam kastam gaa undi kudaa...kani..istaanni champukovatam kastam kadaa.........

      Delete